Indiramma Towers: పేదల కన్నీటికి విలువ కట్టలేం.. అందుకే రూ. కోటి విలువైన ఫ్లాటు.. ఏడాదిలో ఇందిరమ్మ టవర్స్‌ పూర్తి: మంత్రి పొంగులేటి

1 hour ago 1
Red Hills Indiramma Towers: హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో 480 ఫ్లాట్లతో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అజారుద్దీన్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఫ్లాట్లు అందిస్తామని పొంగులేటి ప్రకటించారు. ఒక్కో ఫ్లాట్‌ విలువ రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా లబ్ధిదారుల పేర్లపై ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పారు. ఇంటిపై రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణం పొందే వెసులుబాటు కల్పిస్తామన్నారు. తొలి విడతలో 480 మందికి లక్కీడ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయించగా.. తదుపరి విడతల్లో మిగిలిన వారికి ఇళ్లు మంజూరు చేయనున్నారు.
Read Entire Article