CV Anand Tennis match Final: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్.. క్రికెట్‌లోనే కాదు టెన్నిస్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నారు. హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ టోర్నీలో సీవీ ఆనంద్ ఫైనల్ చేరారు. ఈ టోర్నీలో 55 ప్లస్ సింగిల్స్ కేటగిరిలో ఆయన పోటీపడుతున్నారు. చెన్నెకు చెందిన మణికన్నన్‌తో సెమీ ఫైనల్ చేరగా.. 6-4.6-4 తేడాతో సీవీ ఆనంద్ విజయం సాధించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.