సంక్రాంతి పండక్కి రిలీజ్ కాబోతున్న జననాయగన్ సినిమాపై తెలుగులో కూడా మెల్లి మెల్లిగా క్రేజ్ పెరుగుతుంది. దానికి తోడు దళపతి విజయ్ లాస్ట్ మూవీ అవడతో జనాల్లో ఎక్కడలేని క్యూరియాసిటీ క్రియేట్ అయింది. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'జన నాయకుడు' సాంగ్ రిలీజైంది..