హైదరాబాద్: తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై జానీ మాస్టర్ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్‌కు అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ ఉప్పర్‌పల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. మరి కాసేపట్లో పోలీసులు ఆయనను చెంచలగూడ జైలుకు తరలించనున్నారని తెలుస్తోంది. జానీ మాస్టర్‌పై ఫోక్స్ యాక్ట్ నమోదవడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆయన న్యాయవాది బెయిల్ పిటిషన్ వేయనున్నారని సమాచారం.