హారర్ కామెడీ జానర్‌కు కొత్త ఊపిరి పోసిన సినిమాల్లో కాంచనా. మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో విడుదలై భారీ విజయం సాధించింది. ప్రేక్షకులను నవ్విస్తూ భయపెట్టే కథనం, వినూత్నమైన కాన్సెప్ట్‌తో అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.