తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ప్రముఖ సినీ నటి, ‘డ్రాగన్’ మూవీ హీరోయిన్ కాయదు లోహార్ సందర్శించారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఏఈఓ సతీష్, పిఆర్ఓ రవి స్వాగతం పలికి, స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. అనంతరం మృత్యుంజయ స్వామి వద్ద వేద పండితుల ఆశీర్వచనం పొందారు.