గుప్పెడంత మనసు సీరియల్‌తో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది జగతి మేడం అలియాస్ జ్యోతి. సీరియల్‌లో ఎంతో పద్దతిగా ఉండే ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫోటోలతో ఫైర్ పుట్టిస్తుంది. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు మేయిన్ లీడ్‌లో 'కిల్లర్' అనే సినిమా చేస్తుంది. పూర్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ మాత్రం మాములుగా లేదు.