Krishna River Water to Telangana: తెలంగాణకు కృష్ణా జలాల విడుదలకు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటక సీఎం డీకే శివ కుమార్‌ను కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, పంటలకు ఎదురవుతున్న నీటి కొరతను వివరించారు. జూరాలతో పాటు భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టు పంటలను కాపాడేందుకు నీరు అవసరమని తెలిపారు. 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితిని వివరించడంతో డీకే శివ కుమార్ సానుకూలంగా స్పందించి అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.