Youtuber Rama Nandana Requests On LOC: యూట్యూబర్ రమానందన ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె మరోసారి ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనపై ఉన్న లుక్ అవుట్ నోటీసు రద్దు చేస్తే.. లండన్ వెళ్లిపోతానన్నారు. తన భర్త మధుకర్ వస్తే విచారణ చేయాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. గత విచారణ సందర్భంగా పోలీసుల అడిగిన కొన్ని ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.