మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని అమెరికాలో డ్రామా కోర్స్ చేస్తూన్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా '14 డేస్' అనే షార్ట్ ఫిలింతో గౌతమ్ మెప్పించాడు. తన గర్ల్‌ఫ్రెండ్ కిడ్నాప్ నేపథ్యంలో సాగే ఈ 3 నిమిషాల వీడియోలో గౌతమ్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి. తండ్రికి తగ్గ వారసుడిగా గౌతమ్ చేసిన ఈ ప్రయత్నం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనికి కంటిన్యూ పార్ట్ ఉంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.