టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక సంస్థకు ప్రచారకర్తగా (బ్రాండ్ అంబాసిడర్) ఉన్నందుకు గానూ, రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆయనకు నోటీసులు పంపింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసానికి సంబంధించి దాఖలైన ఫిర్యాదులో మహేశ్ బాబు పేరును కూడా చేర్చారు.