మహేష్ బాబు హీరోగా వచ్చిన బిజినెస్‌మెన్ మూవీ ఏ రేంజ్ హిట్టయిందో తెలిసిందే. 2012లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఒక ఇండస్ట్రీ హిట్, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న కల్ట్ క్లాసిక్ చిత్రం. ఇప్పుడీ మూవీ నవంబర్ 29న రీ-రిలీజ్ కానుంది. 4K అప్‌గ్రేడ్ తో దేశవ్యాప్తంగా థియేటర్లలో మరోసారి విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రీ రిలీజ్ టీజర్ విడుదల చేశారు.