మెగాస్టార్ చిరంజీవి- విక్టరీ వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ సందడి ఎలా ఉంటుందో ‘మన శంకరవరప్రసాద్ గారు’ నిరూపించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వీరిద్దరూ అభిమానులకు పూనకాలు తెప్పించే స్టెప్పులేశారు. ‘అదిరిపోద్ది సంక్రాంతి’ (Mega Victory Mass Song) అనే మాస్ సాంగ్ చేశారు. తాజాగా ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్ ఫుల్ వీడియో వదిలారు మేకర్స్.