సెలబ్రిటీలకు కోట్ల రూపాయల డీల్‌తో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇప్పుడు వారికే శాపంగా మారింది. నిన్నటినుంచి ప్రముఖ సినీ తారలు, టీవీ సెలబ్రిటీలు తెగ వణికిపోతున్నారు. అప్పట్లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వీడియోలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించడమో.. హైడ్ చేయడమో చేసేస్తున్నారు. కానీ లాభం లేదు.ఇప్పుడు అవి వైరల్ అవుతూ నటీనటులకు తలనొప్పిగా మారాయి.