Manchu Vishnu | కన్నప్ప రిలీజ్ ఎప్పుడంటే..!

1 year ago 37
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ కథానాయకుడు మంచు విష్ణు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంచు విష్ణు మాట్లాడుతూ…. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కన్నప్ప సినిమా విజయం సాధించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇక సినిమా అనేక కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడిందన్నారు. డిసెంబర్ లో ముందుగా విడుదల చేయాలని అనుకున్నామని…. కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా విడుదల వాయిదా పడిందన్నారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని విష్ణు తెలియజేశారు. ఇక విష్ణును చూసిన అభిమానులు వానలో సైతం సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.
Read Entire Article