మన భారతీయ సినిమా రంగానికి చెందిన 1000 కోట్ల క్లబ్బులో... హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు స్థానం దక్కించుకున్నాయి. కానీ మలయాళం నుంచి ఇప్పటివరకు ఏ సినిమా కూడా చోటు సంపాదించుకోలేదు. ఈ లోటును భర్తీ చేసే బాధ్యతను "మార్కో" తీసుకుంది. ఈనెల 20న విడుదలైన ఈ చిత్రం మలయాళంలో వసూళ్ల సునామి సృష్టిస్తుండగా... తొలిసారి హిందీలో థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న "మార్కో" అక్కడ కూడా ప్రభంజనం సృష్టిస్తోంది.