కొన్ని చిత్రాలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంటుంది. వాటిలో రాజమౌళి సినిమాలు కూడా ఉంటాయి. టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ సై. ఈ చిత్రం 2004 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది.