టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల్లో 'నాగబంధం' ఒకటి. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు అభిషేక్ నామా దర్శకుడు. విరాట్ కర్న, నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'నమో రే' సాంగ్ రిలీజైంది. విజువల్‌గా సాంగ్ మాత్రం టెర్రిఫిక్‌గా ఉంది. చాలా గ్రాండియర్‌గా పాట చూస్తుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి. జునైద్ కుమార్ స్వర పరిచిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దారురి ఆలపించారు. శ్రీ హర్ష ఎమని సాహిత్యం అందించాడు.