Naga chaitanya-sobhita dhulipala: నాగచైతన్య - శోభిత పెళ్లి వీడియో వైరల్
హైదరాబాద్: నటుడు నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్లి జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లికి (Naga Chaitanya Sobhita Dhulipalla Wedding) సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో నాగచైతన్య.. శోభిత మెడలో తాళి కడుతున్న దృశ్యాలివి. నాగార్జున, వెంకటేశ్, అఖిల్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులు వేదికపై కనిపించారు. ఆనందం వ్యక్తం చేస్తూ.. నూతన జంటకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదీ చదవండి ‘వైభవంగా నాగచైతన్య - శోభిత వివాహం.. ప్రముఖుల సందడి