నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో రూపొందిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. విభిన్నమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా… OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు నిర్మించారు. ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పించడం విశేషం.