సినిమా చూపిస్త మామ, నేను లోకల్, ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన త్రినాథ్ రావ్ నక్కిన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'నేను రెడీ'. హవిష్, కావ్య థాపర్ హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.