కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా చేస్తున్న 'తిమ్మరాజు పల్లి TV' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చుకుంది. పైగా ఊరు బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు వి. మునిరాజ్ దర్శకుడు. సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఊరు సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఊరు అందాలను, ఆచారాలను పాటలో అద్భుతంగా చూపించారు.