Pawan kalyan: పరిస్థితి చేయిదాటితే నేనే హోంమంత్రి.. పవన్ సంచలన వ్యాఖ్యలు

1 year ago 12
పిఠాపురం పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్.. హోంశాఖపై కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పోలీసులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్థులను కులంతో సంబంధం లేకుండా శిక్షించాలని.. గతంలో మాదిరిగా అలసత్వంతో వ్యవహరించవద్దని అన్నారు. ఘటనలపై హోం మంత్రి వంగలపూడి అనిత కూడా బాధ్యత తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్.. హోంశాఖపై రివ్యూ చేయాలని అన్నారు. పరిస్థితులు దిగజారితే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని.. తాను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయంటూ హెచ్చరించారు.
Read Entire Article