పేకాట శిబిరంపై దాడిచేసిన సమయంలో పట్టుబడిన సొమ్ములో కొంత నొక్కేశారు. పోలీసులు. కానీ, చివరకు జూదంలో పట్టుబడిన వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య ఈ విషయంలో తలెత్తిన వివాదం వారి నిర్వాకాన్ని బయట పెట్టించి. దీంతో సీఐ, ఎస్సై సహా నలుగురిని సస్పెన్షన్ చేయించిన ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. గత నెల 8న నిడదవోలు పోలీసుస్టేషన్ సర్కిల్ పెరవలి స్టేషన్ పరిధిలో పేకాట శిబిరంపై దాడిచేసి 30 మందిని పోలీసులు పట్టుకున్నారు.