Rajamouli | ‘పుష్ప 2’కి ఎలాంటి ప్రచారం అవసరం లేదు

1 year ago 25
Rajamouli | ‘పుష్ప 2’కి ఎలాంటి ప్రచారం అవసరం లేదు Rajamouli: ఆ ఒక్క సీన్‌తోనే.. ‘పుష్ప 2’ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమైంది: రాజమౌళి రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఉత్తరాదిలో నీ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.. తప్పకుండా అక్కడ సినిమాని ప్రమోట్‌ చేయ్‌ అని ‘పుష్ప 1’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బన్నీకి (Allu Arjun) చెప్పా. మూడేళ్ల తర్వాత ‘పుష్ప 2’కి ఎలాంటి ప్రచారం అవసరం లేదని చెబుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఈ సినిమా టికెట్స్‌ ఇప్పటికే బుక్‌ చేసుకుని ఉంటారని అర్థమవుతోంది. హీరో, దర్శకుడు.. ఇలా ఈ చిత్రం గురించి ఏం మాట్లాడకపోయినా ఫర్వాలేదు. అందుకే ఓ సరదా సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నా. రెండుమూడు నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో ‘పుష్ప 2’ చిత్రీకరణ జరిగింది. అదే సమయంలో నేనూ అక్కడికెళ్లా. ‘సర్‌.. సినిమాలోని ఓ సీన్‌ చూస్తారా?’ అని సుక్కూ అడిగారు. చూస్తానని నేను చెప్పగానే ఎడిటర్‌ని పిలిచి.. కొన్ని మార్పులు చెప్పారు. అది పుష్పరాజ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌. ‘దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ ఎంత మ్యూజిక్‌ ఇవ్వగలిగితే అంత ఇచ్చేయొచ్చు’ అని చెప్పా. సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఆ ఎపిసోడ్‌తోనే అర్థమైంది’’ అని (pushpa 2 pre release event date) అన్నారు.
Read Entire Article