‘టాక్సీవాలా’తో సూపర్ హిట్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ – దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు సంబంధించి కీలక అప్డేట్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా మూవీ టైటిల్‌ను ప్రకటిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.ఈ పవర్‌ఫుల్ మూవీకి ‘రణబాలి (Ranabaali)’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇది 14వ చిత్రం. స్వాతంత్ర్యానికి ముందరి కాలం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడిగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.