Rashmika Mandanna | అల్లుఅర్జున్ ఎప్పుడూ నా.. సామి
‘పుష్ప 2 ది రూల్’తో (Pushpa 2) థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు కథానాయకుడు అల్లు అర్జున్. సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక కథానాయిక (Rashmika). ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి కేరళలోని కొచ్చిలో ఈ చిత్ర ప్రచార వేడుక నిర్వహించారు.