మాస్ మహారాజా రవితేజ కెరీర్లో గత కొన్ని సంవత్సరాలుగా ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. 'ధమాకా' లాంటి భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన 'ఈగల్' 'మిస్టర్ బచ్చన్' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. వరుసగా రెండు ఫ్లాప్‌లు రావడంతో, రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్ మీద మరింత శ్రద్ధ పెట్టారు.