కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమాలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్ క్యూరియాసిటీ పెంచగా.. తాజాగా ‘అద్దం ముందు’ అంటూ సాగే సెకండ్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. భార్యాభర్తల బంధాన్ని ప్రతిబింబించే ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాశారు. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ కలిసి పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.