మీడియా ప్రతినిధులపై అరవడంపై నటి రేణుదేశాయ్ స్పష్టత ఇచ్చారు. నాకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లే ఆలోచన కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. అతను తనపై అరిచాడని, అందుకే తాను తిరిగి అరిచానని రేణుదేశాయ్ తెలిపారు. ఈ అంశాన్ని అనవసరంగా తన వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టవద్దని, ముఖ్యంగా తన పిల్లలను ఈ వివాదంలోకి లాగవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.