భారత సినిమా రంగంలో సంచలనం సృష్టించిన "కాంతార"కు కొనసాగింపుగా వచ్చిన సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కీలక పాత్ర పోషించింది. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఆ ఆసక్తికర సన్నివేశాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో పంచుకుంది.