వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా మేనమామ ఆశీస్సులు తీసుకున్న మేనల్లుడు.. యువ కథానాయకుడు శ్రీ సాయి దుర్గా తేజ్ వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలియచేశారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సాయి దుర్గా తేజ్ ఎంతో సామాజిక బాధ్యతతో మెలగడం సంతోషదాయకం అని పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీ సాయి దుర్గా తేజ్ గురువారం సాయంత్రం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆశీస్సులు పొందారు.