బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ అందరికీ సుపరిచితమే. అలీఖాన్‌పై కత్తితో దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఇంట్లోకి ప్రవేశించి మరి కత్తితో పొడిచారు దుండగులు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్లు తెలుస్తుంది.