తెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu). సినిమా షూటింగ్‌ల హడావుడికి దూరంగా, తనకంటూ ఓ అందమైన ప్రపంచాన్ని నిర్మించుకుంది. హైదరాబాద్‌లో ఉన్న ఆమె ఇల్లు (Samantha Hyderabad home).. కేవలం ఓ నివాసం కాదు, ఆమె అభిరుచికి, వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఓ అందమైన స్వర్గం. ఆ ఇంటి విశేషాలేంటో చూద్దాం.