బాలీవుడ్ క్యూట్ కపుల్ శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సాహస వీరుడు సాగర కన్య, భలేవాడివి బాసూ, వంటి సినిమాలతో తెలుగువారిని అలరించిన ఈ ముద్దుగుమ్మ 2009, నవంబర్ 22న బ్రిటిష్-ఇండియన్ బిజినెస్‌మ్యాన్ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ దంపతులు తమ 15వ వెడ్డింగ్ యానివర్సరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.