టాలీవుడ్ సినిమాల పోకడను మార్చేసిన మూవీ శివ. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ఈ సినిమా అప్పట్లోనే పెద్ద సంచలనం. ప్రస్తుతం రీ- రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో మళ్లీ ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. నవంబర్ 14న ఈ చిత్రాన్ని 4కే వర్షన్, డాల్బీ సౌండ్తో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు.