కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో కంటి సర్జరీ విషయంలో పొరపాటు జరిగిందంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఎంకమ్మ అనే వృద్ధురాలికి ఎడమ కంటికి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు ముందుగా నిర్ధారించినప్పటికీ.. పొరపాటుగా కుడి కంటికి ఆపరేషన్ చేసినట్లు గుర్తించామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సర్జరీకి ముందు పేషెంట్ వివరాలు, ఆపరేషన్ చేయాల్సిన కంటిని వైద్య బృందం సరిగ్గా పరిశీలించిందా అనే అంశంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.