బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ గురువారం తన భర్త, వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో కలిసి రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. 2026 వసంత కాలంలో బిడ్డ పుట్టవచ్చని తెలిపారు. 40 ఏళ్ల ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెజెంటా కలర్ కో-ఆర్డ్ సెట్‌లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, తన బేబీ బంప్‌ను పట్టుకొని ఉన్న ఫోటోతో ఈ శుభవార్తను ప్రకటించారు.