ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ లో క్రేజ్ కొట్టేస్తున్న హీరో సుహాస్ (Suhas) తాజా చిత్రం ‘హే భగవాన్’. ఫిబ్రవరి 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఎలాగైనా నాన్న బిజినెస్‌ను తాను టేకప్ చేయాలని తాపత్రయ పడే కొడుకు పాత్రలో సుహాస్ నటించాడు. ఈ టీజర్ చూస్తుంటే సినిమా కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.