TDP district presidents: టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ జాబితాను ఖరారు చేశారు. దీంతో టీడీపీ అధికారికంగా ప్రకటించింది. త్రీమెన్ కమిటీల నుంచి తెప్పించుకున్న నివేదికలను పరిశీలించిన అనంతరం అధినేత చంద్రబాబు.. ఈ పేర్లను ఖరారు చేశారు. సీనియారిటీ, అనుభవం, విధేయతతో పాటుగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ కొత్త జిల్లా అధ్యక్షులను చంద్రబాబు ఎంపిక చేశారు.