Telugu Tv Show: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సెకండ్ సీజన్ లాంఛ్ డేట్‌ను స్టార్ మా వెల్లడించింది. మార్చి 29న రాత్రి తొమ్మిది గంటలకు ఈ కామెడీ గేమ్ షో ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ఈ టీవీ షోకు శ్రీముఖి హోస్ట్‌గా, అనసూయ, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరించనున్నారు.