TG: ఆ జిల్లాలోని గ్రామాలకు మహర్దశ.. మున్సిపాలిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ..

3 months ago 8
వరంగల్ జిల్లాలోని నెక్కొండ మేజర్ గ్రామ పంచాయితీని మున్సిపాలిటీగా మార్చాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమునారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. నెక్కొండతో పాటు మరో ఐదు గ్రామ పంచాయితీలను (అమీన్‌పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీకే తండా) కలిపి కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలతో నెక్కొండ ప్రజల అభివృద్ధి ఆకాంక్ష నెరవేరనుంది.
Read Entire Article