తెలంగాణ టెన్త్ వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులకు తీపి కబురు. వాట్సాప్ ద్వారా ఈజీగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్ నుంచి కూడా టెన్త్ విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.