TG: నేటి నుంచి షోరూం వద్దనే కారు, బైక్ రిజిస్ట్రేషన్స్.. కావాల్సిన పత్రాలు ఇవే..

1 month ago 3
తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు రవాణా శాఖ ఊరటనిస్తూ షోరూమ్‌లలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇకపై ద్విచక్ర వాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొన్న చోటే డీలర్ ఆన్‌లైన్‌లో ఇన్వాయిస్, ఇన్సూరెన్స్ మరియు ఇతర పత్రాలను అప్‌లోడ్ చేస్తారు. అధికారులు వీటిని పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. శాశ్వత రిజిస్ట్రేషన్ కార్డు (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా యజమాని ఇంటికి చేరుతుంది. అయితే.. ఈ సౌకర్యం కేవలం వ్యక్తిగత వాహనాలకే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్ మాత్రం పాత పద్ధతిలోనే ఆర్టీఓ కార్యాలయాల్లో జరుగుతుంది.
Read Entire Article