తెలంగాణలో ప్రజా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని ప్రోత్సహిస్తూ.. టీజీఎస్ఆర్టీసీ 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడంతో పాటు, ప్రయాణికుల రద్దీని తగ్గించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం దీని లక్ష్యం.