సంక్రాంతికి 5 రోజులు ముందుగానే పండగ వాతావరణం తీసుకురాబోతున్న రాజాసాబ్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు జనవరి 9 వస్తందా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హార్రర్ ఫాంటసీ సినిమాలో ప్రభాస్ హీరోగా.. మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. నిధి అగర్వాల్, రిద్దీ కుమార్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంది. విజువల్‌గా మైండ్ బ్లాక్ చేస్తుంది.