ప్రపంచ సినిమా గడప దాటి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రభాస్.. బాహుబలి, సలార్, కల్కి తర్వాత ఇప్పుడు వింటేజ్ డార్లింగ్ లుక్‌తో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు – ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్‌లో ప్రభాస్‌ను మనం ఎన్నాళ్లుగానో మిస్ అయిన కామెడీ టైమింగ్, రొమాన్స్, ఎనర్జీతో చూడబోతున్నాం. సంజయ్ దత్ పవర్‌ఫుల్ పాత్ర, మాళవిక మోహనన్ గ్రాండ్ ఎంట్రీ, నిధి అగర్వాల్ & రిద్ది కుమార్ గ్లామర్, థమన్ మ్యూజిక్ కలిసి ఈ సినిమాను పక్కా ఫెస్టివ్ ట్రీట్‌గా మార్చాయి. 189 నిమిషాల నిడివి, ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ హారర్ & ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్, క్లైమాక్స్‌లో నెక్స్ట్ లెవల్ విజువల్స్ అంటూ టాక్ నడుస్తోంది. సెన్సార్ టీమ్, ట్రేడ్ వర్గాలు, రివ్యూవర్స్ అందరూ రాజా సాబ్‌పై పాజిటివ్ వైబ్స్ చెబుతున్నారు.