కొత్త సంవత్సర కానుకగా ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు రాజాసాబ్ మేకర్స్. ‘ది రాజా సాబ్’ (The Raja Saab) నుంచి మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలోని ‘రాజే యువరాజే..’ ఆడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్. జనవరి 9న ఈ మూవీ విడుదల కానుంది.