హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎదురైన చేదు అనుభవాన్ని బాలీవుడ్ నటి మౌనీ రాయ్ (Mouni Roy) భావోద్వేగంగా పంచుకున్నారు. ఆ ఈవెంట్ సందర్భంగా తనపై జరిగిన అసభ్య ప్రవర్తన, వేధింపుల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.