రాకింగ్ స్టార్ యష్, నయనతార నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' సినిమా టీజర్ ఫిబ్రవరి 20న ఉదయం 9:35 గంటలకు విడుదలైంది. మొత్తం యాక్షన్ సీన్లతో నిండిపోయింది. 2 నిమిషాల్లో పెను విధ్వంసాన్ని చూపించాడు. రక్తపాతం మామూలుగా లేదు. ఈ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్‌ను గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. KGF తర్వాత యష్ తిరిగి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో యష్ 'రాయ' పాత్రలో డార్క్ యాక్షన్ చూపిస్తాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో #Yash19 ట్రెండింగ్ అవుతోంది.